చిన్నారులపై లైంగిక వేధింపులను నిరోధించాలి : త్రిష

ABN , First Publish Date - 2020-10-14T21:18:23+05:30 IST

చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిరోధించేందుకు అందరూ కృషి చేయాలని యూనిసెఫ్‌ బాలల హక్కుల సంఘం రాయబారి, అందాలనటి త్రిష పిలుపునిచ్చారు

చిన్నారులపై లైంగిక వేధింపులను నిరోధించాలి : త్రిష

చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిరోధించేందుకు అందరూ కృషి చేయాలని యూనిసెఫ్‌ బాలల హక్కుల సంఘం రాయబారి, అందాలనటి త్రిష పిలుపునిచ్చారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువతీ యువకులతో జూమ్‌ యాప్‌ ద్వారా త్రిష మాట్లాడారు. బాల్యవివాహాల వలన కలిగే అనర్థాలను గురించి ప్రజలలో అవగాహన కలిగేలా ప్రచారం చేయాలని, చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగకుండా రక్షణ వలయంగా నిలవాలని ఆమె కోరారు. పసివాడని చిన్నారులపై ఇటీవలకాలంలో అత్యాచారాలు  కూడా జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఎక్కడా చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగకుండా స్వచ్చంద సంస్థలు, వలంటీర్లు తీవ్రంగా కృషి చేయాలని, నేరస్థులకు శిక్షపడేలా చేయాలని త్రిష విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-10-14T21:18:23+05:30 IST