పెళ్లిపై త్రిష ఆసక్తికర కామెంట్!

ABN , First Publish Date - 2020-11-17T15:11:09+05:30 IST

రెండు దశాబ్దాల క్రితం తెరంగేట్రం చేసిన చెన్నై చిన్నది త్రిష తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగింది.

పెళ్లిపై త్రిష ఆసక్తికర కామెంట్!

రెండు దశాబ్దాల క్రితం తెరంగేట్రం చేసిన చెన్నై చిన్నది త్రిష తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగింది. ఇరు భాషల్లోనూ దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించింది. 37 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ వివాహానికి మాత్రం దూరంగానే ఉంది. గతంలో చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం వరకు వెళ్లినా.. పెళ్లి పీటలెక్కక ముందే బ్రేకప్ జరిగిపోయింది. 


ఆ తర్వాత త్రిష కెరీర్‌పై దృష్టి సారించి వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే ఆమె పెళ్లిపై పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి త్రిష తాజాగా స్పందించింది. `నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితేనే నా వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది. అప్పటివరకు సింగిల్‌గానే ఉంటాను. అలాంటి వ్యక్తి దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే గడిపేస్తాన`ని త్రిష పేర్కొంది. 

Updated Date - 2020-11-17T15:11:09+05:30 IST