త్రిష కొత్త ఫ్రెండ్‌!

ABN , First Publish Date - 2020-10-30T07:21:55+05:30 IST

నటనలోనే కాదు సాహసిక ప్రవృత్తిలోనూ ఓ అడుగు ముందుంటారు త్రిష. గతంలో సముద్రంలో స్కూబా డైవింగ్‌ చేసిన చిత్రాలను ఆమె...

త్రిష కొత్త ఫ్రెండ్‌!

నటనలోనే కాదు సాహసిక ప్రవృత్తిలోనూ ఓ అడుగు ముందుంటారు త్రిష. గతంలో సముద్రంలో స్కూబా డైవింగ్‌ చేసిన చిత్రాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. లాక్‌డౌన్‌లో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని గుర్రపుస్వారీ నేర్చుకున్నట్టు త్రిష కొన్ని రోజుల క్రితం చెప్పారు. గుర్రంపై స్వారీ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. తాజాగా త్రిష తన కొత్త ఫ్రెండ్‌ను అభిమానులకు పరిచయం చేశారు. తనకు బాగా మచ్చికైన అశ్వాన్ని ‘‘నా కొత్త ఫ్రెండ్‌’’ అంటూ తన అభిమానులకు ఆమె పరిచయం చేశారు. తన గుర్రంతో కలసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ ఫొటో త్రిష అభిమానుల మనసు గెలుచుకుంది. ‘‘నా ఫ్రెండ్‌కి హాయ్‌ చెప్పండి, ఆకాశమే నీ హద్దు’’ అని  ఆమె ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-10-30T07:21:55+05:30 IST