త్రిష ఆ ప‌నెందుకు చేసింది?

ABN , First Publish Date - 2020-08-19T21:24:18+05:30 IST

ద‌శాబ్దంన్న‌ర కాలంగా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటోన్న హీరోయిన్ త్రిష‌. తాజాగా ఈమె చేసిన ఓ పని అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇంతకీ త్రిష ఏం చేసింది..?

త్రిష ఆ ప‌నెందుకు చేసింది?

ద‌శాబ్దంన్న‌ర కాలంగా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటోన్న హీరోయిన్ త్రిష‌. ఈ స్టార్ హీరోయిన్ ఏజ్ పెరుగుతున్నా స్పీడు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈమె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. త‌నకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోష‌ల్ మీడియా ద్వారానే తెలియ‌జేస్తుంటారు. కొన్నిరోజుల ముందు తాను సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌నుకుంటున్నాన‌ని త్రిష తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త్రిష త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల‌న్నింటినీ తొల‌గించింది. అస‌లు త్రిష త‌న పాత పోస్టుల‌ను ఎందుకు తొల‌గించింది? అని అభిమానులు అనుకుంటున్నారు. మ‌రి అభిమానుల సందేహాన్ని త్రిష తీరుస్తుందేమో చూడాలి. 

Updated Date - 2020-08-19T21:24:18+05:30 IST