నితిన్ ‘రంగ్‌దే’ టీజర్‌కు ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..

ABN , First Publish Date - 2020-08-02T00:41:44+05:30 IST

యువ కథానాయకుడు నితిన్, మహానటి ఫేమ్ కీర్తి సురేష్‌ల తొలి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి

నితిన్ ‘రంగ్‌దే’ టీజర్‌కు ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..

యువ కథానాయకుడు నితిన్, మహానటి ఫేమ్ కీర్తి సురేష్‌ల తొలి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. అయితే ఇటీవల నితిన్ పెళ్లికానుకగా చిత్రయూనిట్ ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా నితిన్ పెళ్లిరోజున సింక్ అయ్యేలా టీజర్ ఉంది.


అయితే ఇప్పటి వరకు ఈ టీజర్‌కు ఎన్ని వ్యూస్ వచ్చిందీ, ఎన్ని లైక్స్ వచ్చింది చిత్రయూనిట్ తెలియజేస్తూ.. టీజర్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఇక ఈ టీజర్ ఇప్పటి వరకు 8.5 మిలియన్ ప్లస్ వ్యూస్, 250కె ప్లస్ లైక్స్‌ను సాధించినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ బాధ్యతలు వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుందన్నట్లుగా చిత్ర టీజర్‌లో తెలియజేశారు. Updated Date - 2020-08-02T00:41:44+05:30 IST