టాప్ ఫైవ్‌లో శర్వా కచ్చితంగా ఉంటాడు: సమంత

ABN , First Publish Date - 2020-02-03T22:39:09+05:30 IST

తమిళంలో ఘన విజయం సాధించి, క్లాసిక్‌గా నిలిచిన `96` తెలుగులోకి `జాను`గా రీమేక్ అవుతోంది.

టాప్ ఫైవ్‌లో శర్వా కచ్చితంగా ఉంటాడు: సమంత

తమిళంలో ఘన విజయం సాధించి, క్లాసిక్‌గా నిలిచిన `96` తెలుగులోకి `జాను`గా రీమేక్ అవుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల ఏడో తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో శర్వానంద్, సమంత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శర్వా నటన గురించి సమంత మాట్లాడింది.
 
`శర్వా నటించిన చాలా సినిమాలు నేను చూశాను. అతను అద్భుతమైన నటుడు. పాత్రలో లీనమైతే ఏమైనా చేస్తాడు. ఈ సినిమాలో శర్వా నటన మరింత అద్భుతంగా ఉంటుంది. చాలా సీన్లలో ఆటోమేటిగ్గా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలాంటి నటుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లోని టాప్ ఫైవ్ బెస్ట్ యాక్టర్స్‌లో శర్వా ఒకరు` అని సమంత అభిప్రాయపడింది.

Updated Date - 2020-02-03T22:39:09+05:30 IST