2020.. ట్విట్టర్‌లో టాప్‌ టెన్‌ స్థానాలు వీరివే

ABN , First Publish Date - 2020-12-15T01:52:40+05:30 IST

కరోనా దెబ్బతో ఈ ఇయర్‌ 2020 ఎలా గడిచిపోతుందా అని అనుకున్నవారే కానీ.. అనుకోని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఎట్టకేలకు 2020ని ముగించేసి.. ఇంకొన్ని రోజుల్లో

2020.. ట్విట్టర్‌లో టాప్‌ టెన్‌ స్థానాలు వీరివే

కరోనా దెబ్బతో ఈ ఇయర్‌ 2020 ఎలా గడిచిపోతుందా అని అనుకున్నవారే కానీ.. అనుకోని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఎట్టకేలకు 2020ని ముగించేసి.. ఇంకొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక 2020కి సంబంధించిన ట్విట్టర్‌ లెక్కలను ఒక్కొక్కటిగా ట్విట్టర్‌ ఇండియా బయటపెడుతుంది. ఏ హీరో, హీరోయిన్‌ పేరు బాగా ట్రెండ్‌ అయ్యింది, ఏ సినిమా పేరు టాప్‌ స్థానాన్ని ఆక్రమించిదనే లెక్కలను తాజాగా ట్విట్టర్‌ ఇండియా విడుదల చేసింది. ఆ లెక్కలేంటో తెలుసుకుందామా.. 


సౌత్‌కి సంబంధించి ట్రెండ్‌ అయిన టాప్‌ టెన్‌ సినిమాల లిస్ట్:

1. మాస్టర్‌ (విజయ్‌), 2. వకీల్‌సాబ్‌ (పవన్‌ కల్యాణ్‌), 3. వాలిమై (అజిత్‌), 4. సర్కారు వారి పాట (మహేష్‌ బాబు), 5. సూరారైపొట్రు (సూర్య), 6. ఆర్‌ఆర్‌ఆర్‌ (ఎన్టీఆర్‌, చరణ్‌), 7. పుష్ప (అల్లు అర్జున్‌), 8. సరిలేరు నీకెవ్వరు (మహేష్‌ బాబు), 9. కె.జి.యఫ్‌ చాఫ్టర్‌ 2(యష్‌), 10. దర్బార్‌ (రజనీకాంత్‌). 


ట్రెండ్‌ అయిన హీరోల టాప్‌ టెన్‌ లిస్ట్:

1. మహేష్‌ బాబు, 2. పవన్‌ కల్యాణ్‌, 3. విజయ్‌, 4. తారక్‌(ఎన్టీఆర్‌), 5. సూర్య, 6. అల్లు అర్జున్‌, 7. రామ్‌ చరణ్‌, 8. ధనుష్‌, 9. మోహన్‌లాల్‌, 10. చిరంజీవి. 


ట్రెండ్‌ అయిన హీరోయిన్‌ల టాప్‌ టెన్‌ లిస్ట్:

1. కీర్తి సురేష్‌, 2. కాజల్‌ అగర్వాల్‌, 3. సమంత, 4. రష్మిక మందన్నా, 5. పూజా హెగ్డే, 6. తాప్సీ, 7. తమన్నా, 8. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, 9. శృతిహాసన్‌ 10. త్రిష

Updated Date - 2020-12-15T01:52:40+05:30 IST

Read more