మా నాన్న మరణం కలిచివేసింది: దర్శకుడు వీరశంకర్

ABN , First Publish Date - 2020-02-18T22:12:05+05:30 IST

ప్రముఖ దర్శకుడు వీరశంకర్‌ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకు..

మా నాన్న మరణం కలిచివేసింది: దర్శకుడు వీరశంకర్

ప్రముఖ దర్శకుడు వీరశంకర్‌ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన  పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం చివటంలో  మంగళవారం తుది శ్వాస విడిచారు. సత్యనారాయణకు వీరశంకర్‌తో పాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ మృతి విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. తండ్రి బైరెశెట్టి సత్యనారాయణ గురించి వీరశంకర్ మాట్లాడుతూ ‘‘మా నాన్నే మాకు స్ఫూర్తి. నిజాయితీ, కష్టపడే తత్వాన్ని నేర్పారు. మా నాన్న మరణం కలిచివేసింది. నాన్న ఎప్పటికీ మంచి జ్ఞాపకం.’’ అని అన్నారు. 


కాగా దర్శకుడు వీరశంకర్.. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘హలో ఐ లవ్ యూ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రేమకోసం, విజయరామరాజు, యువరాజ్యం, మన కుర్రాళ్లే చిత్రాలకు కూడా వీరశంకర్ దర్శకత్వం వహించారు. 

Updated Date - 2020-02-18T22:12:05+05:30 IST