తెలుగు సినీ తారల చిన్నప్పటి ఫొటోలు

ABN , First Publish Date - 2020-02-04T17:18:52+05:30 IST

సినీ తారల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.. ఫేవరెట్ హీరో ఏం చదువుకున్నారు..

తెలుగు సినీ తారల చిన్నప్పటి ఫొటోలు

సినీ తారల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.. ఫేవరెట్ హీరో ఏం చదువుకున్నారు.. అభిమాన హీరోయిన్‌ది ఏ ప్రాంతం.. చిన్నప్పుడు ఎలా ఉండేవారు.. వంటి సంగతులు ఎవరికైనా ఆసక్తికరమే.. మరి అందుకే.. టాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్లు చిన్నప్పుడు ఎలా ఉండేవారో మేం మీకు చూపిస్తున్నాం. మరి మీ అభిమాన హీరోయిన్లు చిన్నప్పటి ఫొటోలను ఓ లుక్కేయండి..


లక్ష్మీ కల్యాణంతో టాలీవుడ్‌లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అగ్రహీరోయిన్‌గా ఎదిగిన కాజల్.. చిన్నప్పటి ఫొటో ఇది.. 


విభిన్న పాత్రలను ఎంచుకుంటూ.. మహానటి సినిమాలో సావిత్రిగా నటించి.. తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన కీర్తి సురేష్ చిన్ననాటి ఫొటో ఇది.. 


పొట్టిగా ఉండటం కూడా ఓ వరం.. ఎన్నో లాభాలున్నాయంటూ.. నేరుగానే చెప్పేసిన నటి నిత్యామీనన్.. అందం, అభినయం కలబోసిన నిత్యామీనన్ చిన్నప్పటి ఫొటో ఇది.. 


అతి తక్కువ సినిమాలతోనే.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందీ పూజా హెగ్దే.. మెగా ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు పొందిన ఈ హీరోయిన్ చిన్నప్పుడు ఎంత అల్లరి పిల్లో ఓ లుక్కేయండి.. 


ఛలో, గీత గోవిందం సినిమాలతో ట్రాక్‌లోకి వచ్చి.. సరిలేరు నీకెవ్వరుతో మహేశ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన నటి రష్మిక.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక చిన్నప్పటి ఫొటో ఇది.. 


అక్కినేని హీరోతోనే మొదటి తెలుగు సినిమాలో నటించి.. ఆ హీరోనే ప్రేమించి పెళ్లాడి.. అక్కినేని కోడలిగా స్థానం సంపాదించిన నటి సమంత.. టాలీవుడ్‌లో నటనకు ప్రాథాన్యం ఇచ్చే సినిమాల్లో నటించే హీరోయిన్‌గా పేరు సంపాదించిన సమంత చిన్నప్పటి ఫొటో ఇది.. 


వర్షం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి.. వరుస అవకాశాలను చేజిక్కించుకుని టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటి త్రిష.. ప్రస్తుతం విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఇతర భాషా సినిమాల్లో కూడా నటిస్తున్న త్రిష చిన్నప్పటి ఫొటో ఇది.. 


Updated Date - 2020-02-04T17:18:52+05:30 IST