షూటింగులకు టైముంది!

ABN , First Publish Date - 2020-06-08T04:23:45+05:30 IST

తమిళనాడు ప్రభుత్వం టీవీ షూటింగులకు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సినిమా షూటింగులకూ అనుమతి ఇవ్వమని దర్శకులు, నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారు...

షూటింగులకు టైముంది!

తమిళనాడు ప్రభుత్వం టీవీ షూటింగులకు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సినిమా షూటింగులకూ అనుమతి ఇవ్వమని దర్శకులు, నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కమల్‌ హాసన్‌ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. షూటింగులు ప్రారంభించడానికి కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితులలో ప్రజలకు సినిమా నిత్యావసరం కాదు. మద్యం దుకాణాలను వెంటనే తెరవాల్సిన అవసరం ఎలా లేదో... అలాగే షూటింగులూ త్వరగా ప్రారంభించాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు వెయిట్‌ చేయవచ్చు. షూటింగులకు టైముంది’’ అని కమల్‌ హాసన్‌ అన్నారు.


Updated Date - 2020-06-08T04:23:45+05:30 IST