పాటతోనే ఫ్యాన్స్‌కు థాంక్స్‌ చెప్పిన స్టార్‌ హీరో

ABN , First Publish Date - 2020-09-29T16:34:53+05:30 IST

మాటల రూపంలోనే అయితే ఓ బాలీవుడ్‌ స్టార్‌ మాత్రం మాటల రూపంలో కాకుండా పాట రూపంలో అభిమానులకు థాంక్స్‌ చెప్పారు. ఇంతకూ ఆ ఆస్టార్ ఎవరో కాదు.. టైగర్ ష్రాఫ్‌.

పాటతోనే ఫ్యాన్స్‌కు థాంక్స్‌ చెప్పిన స్టార్‌ హీరో

సాధారణంగా మనకు సాయం చేసిన వారికి, మనల్ని ఎంకరేజ్‌ చేసిన వారికి థాంక్స్‌ చెబుతుంటాం. అది కూడా మాటల రూపంలోనే అయితే ఓ బాలీవుడ్‌ స్టార్‌ మాత్రం మాటల రూపంలో కాకుండా పాట రూపంలో అభిమానులకు థాంక్స్‌ చెప్పారు. ఇంతకూ ఆ ఆస్టార్ ఎవరో కాదు.. టైగర్ ష్రాఫ్‌. వివరాల్లోకెళ్తే.. ఇటీవల టైగర్‌ ష్రాఫ్‌ 'అన్‌బిలీవబుల్‌..' అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో టైగర్‌ నటించడంతో పాటు పాటను పాడాడు కూడా. ఈ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తన పాటను అంతలా ఆదరించిన తన ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు టైగర్‌ ష్రాఫ్‌ పాట రూపంలోనే థాంక్స్‌ చెప్పాడు. తన పాట 'అన్‌ బిలీవబుల్‌'లోని కొన్ని లైన్స్‌ను చక్కగా పాడాడు టైగర్‌ ష్రాఫ్‌. అంతే కాకుండా తన పాటలోని కొన్ని లైన్స్‌ను పాడి ఆ వీడియో క్లిప్స్‌ను తనకు పంపమని అభిమానులను టైగర్‌ కోరాడు. 
Updated Date - 2020-09-29T16:34:53+05:30 IST