గణపత్‌గా టైగర్‌ ష్రాఫ్‌

ABN , First Publish Date - 2020-11-06T09:56:03+05:30 IST

కళ్లుచెదిరే యాక్షన్‌ సన్నివేశాలతో అభిమానులను అలరించేందుకు ఎంత కష్టానికైనా వెనుకాడరు బాలీవుడ్‌ యాక్షన్‌స్టార్‌ టైగర్‌ష్రాప్‌...

గణపత్‌గా టైగర్‌ ష్రాఫ్‌

కళ్లుచెదిరే యాక్షన్‌ సన్నివేశాలతో అభిమానులను అలరించేందుకు ఎంత కష్టానికైనా వెనుకాడరు బాలీవుడ్‌ యాక్షన్‌స్టార్‌ టైగర్‌ష్రాప్‌. తాజాగా ఆయన నటిస్తోన్న మూవీ సిరీస్‌ ‘గణపత్‌’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను టైగర్‌ గురువారం ఇన్‌స్టాలో విడుదల చేశారు. ‘‘మిగిలిన చిత్రాలతో పోల్చితే ఇది నాకు చాలా ప్రత్యేకం, మీకు (అభిమానులు)మరింత ప్రత్యేకం. మరింత యాక్షన్‌, థ్రిల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సిద్ధంగా ఉండండి’’ అని  టైగర్‌ష్రాఫ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘హీరోపంత్‌ 2’ చిత్రం షూటింగులో టైగర్‌ పాల్గొంటున్నారు. ఈ చిత్రం 2022లో విడుదలవుతుంది. వికాస్‌ బహల్‌ దర్శకత్వంలో విషు భగ్నానీ నిర్మిస్తున్నారు.

Updated Date - 2020-11-06T09:56:03+05:30 IST