సెప్టెంబర్‌ మొదటివారంలో బిగ్‌బాస్‌ ఆకర్షణగా టిక్‌టాక్‌ స్టార్లు

ABN , First Publish Date - 2020-08-25T05:26:58+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సారి కూడా ఈ షోకు హోస్ట్‌గా నాగార్జున వ్యవహరిస్తారు. వాస్తవానికి బిగ్‌బాస్‌ సీజన్‌ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది...

సెప్టెంబర్‌ మొదటివారంలో బిగ్‌బాస్‌ ఆకర్షణగా టిక్‌టాక్‌ స్టార్లు

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సారి కూడా ఈ షోకు హోస్ట్‌గా నాగార్జున వ్యవహరిస్తారు. వాస్తవానికి బిగ్‌బాస్‌ సీజన్‌ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలను ఎంత కాలం క్వారంటైన్‌లో ఉంచాలి? ఒక సారి షోలో ప్రవేశించిన తర్వాత వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే ఏం చేయాలి? వీకెండ్‌లో ప్రేక్షకులను అనుమతించాలా? వద్దా?- వంటి అనేక అంశాలపై సందిగ్దత నెలకొనటంతో ఈ షో లేటయింది. ఈ షోలో పాల్గొనే కొందరు సెలబ్రిటీలను ఇప్పటికే క్వారంటైన్‌లో ఉంచారు. బుల్లితెరపై పేరుమోసిన యాంకర్లు, ఇతర నటీనటులతో పాటుగా టిక్‌టాక్‌ స్టార్లను కూడా ఈ సారి షోకు ఎంపిక చేశారు. వీరు ఈ సారి షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని భావిస్తున్నారు.

Updated Date - 2020-08-25T05:26:58+05:30 IST