మూడు విమానాలు... 120మంది ఆహ్వానితులు!

ABN , First Publish Date - 2020-12-08T07:09:49+05:30 IST

వెంకటచైతన్య జొన్నలగడ్డను వధువు నిహారికా కొణిదెల అడిగారు. ‘‘ఓ యస్‌!’’ అని అతడు బదులిచ్చాడు. ప్రయాణానికి గుర్తుగా అన్నట్టు...

మూడు విమానాలు... 120మంది ఆహ్వానితులు!

ఏ సంబరం ఎప్పుడు?

సంగీత్‌ వేడుక: సోమవారం రాత్రి జరిగింది. తొమ్మిది గంటలకు మొదలై... అర్ధరాత్రి వరకూ జరిగినట్టు సమాచారం.

హల్దీ ఫంక్షన్‌: మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు జరగనుంది.

మెహందీ వేడుక: బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు!

వివాహ మహోత్సవం: బుధవారం రాత్రి 7.15 గంటలకు!


‘‘హే చైతన్య... రోలర్‌ కోస్టర్‌ రైడ్‌కి రెడీనా?’’ - వరుడు 

వెంకటచైతన్య జొన్నలగడ్డను వధువు నిహారికా కొణిదెల అడిగారు. ‘‘ఓ యస్‌!’’ అని అతడు బదులిచ్చాడు. ప్రయాణానికి గుర్తుగా అన్నట్టు విమానంలో వాళ్లిద్దరూ దిగిన ఫొటోను ప్రశ్నతో పాటు పోస్ట్‌ చేశారు. దానిని నిహారిక అన్నయ్య, హీరో వరుణ్‌తేజ్‌ తీశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌ విలాస్‌ ప్యాలె్‌సలో బుధవారం రాత్రి చైతన్య, నిహారిక వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. వధూవరులు, వాళ్ల కుటుంబాలతో పాటు ఆహ్వానితులు అందరూ సోమవారమే ఉదయ్‌ విలాస్‌ చేరుకున్నారు.


తొలుత కాబోయే వియ్యంకులు నాగబాబు, రిటైర్డ్‌ ఐజీ ప్రభాకరరావు కుటుంబాలు ఓ ప్రైవేట్‌ జెట్‌లో ఉదయ్‌పూర్‌ వెళ్లారు. విమానంలో కుటుంబ సభ్యులందరూ దిగిన సెల్ఫీని వరుణ్‌తేజ్‌ సహా చైతన్య, నిహారిక సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘‘నిశ్చయ్‌ (నిహారిక ప్లస్‌ చైతన్య) బిగిన్స్‌’’ అని పేర్కొన్నారు. ఉదయ్‌ విలాస్‌ చేరుకున్న తర్వాత వధూవరులు చేసిన నృత్యం నెటిజన్లను ఆకర్షించింది. మెగాస్టార్‌ కుటుంబం... చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన మరో విమానంలో వెళ్లారు. తండ్రి చిరంజీవి స్కెచ్‌ ఫొటో మాస్క్‌ను ధరించిన రామ్‌చరణ్‌ ‘‘బాస్‌ మాస్క్‌’’ అని పేర్కొన్నారు. అల్లు అరవింద్‌ దంపతులు, పిల్లలతో పాటు అల్లు అర్జున్‌-స్నేహారెడ్డి దంపతులు ఇంకో విమానంలో ఉదయ్‌పూర్‌ వెళ్లారు. ‘‘చాలా సంవత్సరాల తర్వాత కుటుంబమంతా కలిసి విమాన ప్రయాణం చేస్తున్నాం. నిహారిక, చైతన్య పెళ్లి సంబరాలు మొదలయ్యాయి’’ అని అల్లు అర్జున్‌ పోస్ట్‌ చేశారు. పిల్లలతో సహా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత-విష్ణుప్రసాద్‌ దంపతులు, చిన్న కుమార్తె శ్రీజ- కల్యాణ్‌దేవ్‌ దంపతులు, చిరంజీవి మేనల్లుళ్లు సాయితేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ సహా వాళ్ల తల్లిదండ్రులు ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు.


పట్టు వస్త్రాలతో పెళ్లి పిలుపు

వివాహానికి మొత్తం 120మందిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పెళ్లికి ఆహ్వానించిన సమయంలో అందరికీ పట్టు వస్త్రాలు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆహ్వానితులందరూ సోమవారమే వివిధ విమానాల్లో ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. వాళ్లందరికీ ఉదయ్‌ విలా్‌సలోనే బస ఏర్పాటు చేశారు. మెగా కుటుంబం, బంధువులు కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పెళ్లికి వెళ్లినవారిలో కథానాయికలు లావణ్యా త్రిపాఠీ, రీతూ వర్మ ఉన్నారు. ఈ ఇద్దరూ నిహారిక స్నేహితులే. పరిశ్రమ నుంచి ఇంకెవరు వెళ్లారో తెలియాల్సి ఉన్నది.

Updated Date - 2020-12-08T07:09:49+05:30 IST