న‌టుడు జ‌గ‌ప‌తిబాబు సోద‌రుడికి బెదిరింపు కాల్స్

ABN , First Publish Date - 2020-10-09T02:01:07+05:30 IST

నటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్ర కుమార్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్స్ రావడంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గుట్టల

న‌టుడు జ‌గ‌ప‌తిబాబు సోద‌రుడికి బెదిరింపు కాల్స్

నటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్ర కుమార్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్స్ రావడంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గుట్టల బేగంపేట స్థలం విషయంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి నుంచి తనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్ వస్తున్నట్లుగా చెబుతూ.. యుగేంద్ర కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యుగేంద్ర కుమార్‌తో పాటు అతని కుమారుడిని కూడా చంపేస్తామని శ్రీనివాస్‌ అనే వ్యక్తి బెదిరించినట్లుగానూ, ఈ బెదిరింపుల వెనుక ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి ఉన్నట్లుగా ఆయన పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. యుగేంద్ర కుమార్‌ ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లుగా సమాచారం.

Updated Date - 2020-10-09T02:01:07+05:30 IST