తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌ లోగో విడుదల

ABN , First Publish Date - 2020-09-08T00:55:02+05:30 IST

కోమారి జానకిరామ్ దర్శకత్వంలో నిర్మాత కోమారి జానయ్య నాయుడు ఇటీవల ఓ చిత్రాన్ని ప్రకటించిన

తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌ లోగో విడుదల

కోమారి జానకిరామ్ దర్శకత్వంలో నిర్మాత కోమారి జానయ్య నాయుడు ఇటీవల ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తోలుబొమ్మల సిత్రాలు అనే బ్యానర్ మీద రూపుదిద్దుకోనుంది. తాజాగా ఈ బ్యానర్‌ వీడియో మరియు లోగోను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖా మంత్రి ఎస్.బి. అంజద్ భాషా ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఎస్.బి. అంజద్ భాషా మాట్లాడుతూ.. సినిమా పుట్టుకకి బీజమైన తోలుబొమ్మలాట కళని గుర్తు చేసేలా తోలుబొమ్మల సిత్రాలు అని బ్యానర్‌కి పేరు పెట్టినందుకు అభినందిస్తున్నాను. ఈ బ్యానర్ తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సంస్థగా ఎదగాలని, ఈ బ్యానర్‌లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. చిత్రయూనిట్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.. అని అన్నారు.


దర్శకుడు కోమారి జానకిరామ్ మాట్లాడుతూ.. మా తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ లోగో మరియు వీడియోను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్ భాషాగారు ఆవిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్ర కథాంశంను తెలుసుకొని ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని వారు తెలపడం సంతోషం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్, ఇతర విషయాలను త్వరలో ప్రకటిస్తాము.. అని తెలిపారు.

Updated Date - 2020-09-08T00:55:02+05:30 IST