అదే ఆలోచించా!

ABN , First Publish Date - 2020-06-28T06:54:29+05:30 IST

‘‘తినడం, నిద్రపోవడం, ఇంటి పనులు చేసుకోవడం, అతిగా (సినిమాలు, సిరీ్‌సలు) చూడటం, పుస్తకాలు చదవడానికి ప్రయత్నించడం,...

అదే ఆలోచించా!

‘‘తినడం, నిద్రపోవడం, ఇంటి పనులు చేసుకోవడం, అతిగా (సినిమాలు, సిరీ్‌సలు) చూడటం, పుస్తకాలు చదవడానికి ప్రయత్నించడం, సీలింగ్‌ వైపు అదే పనిగా చూడటం, నాతో నేను మాట్లాడుకోవడం... లాక్‌డౌన్‌లో నేను చేస్తున్న పనులివే’’ అని షాలినీ పాండే అన్నారు. ‘అర్జున్‌రెడ్డి’తో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఉత్తరాది భామ, ప్రస్తుతం హిందీ చిత్రాలపై దృష్టి సారించారు. కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ముంబైలోని ఫ్లాట్‌కి పరిమితమైన షాలినీ పాండేను ‘ఇంట్లో ఏం చేస్తున్నారు?’ అని అడిగితే పైన చెప్పిన సమాధానం ఇచ్చారు. ‘‘లాక్‌డౌన్‌లో ఏలియన్స్‌ గురించీ ఆలోచించా. మన కంటికి కనిపించని వారు ఎవరైనా ఉన్నారా? మనపై ఎవరైనా దాడి చేస్తారా? అనే ఆలోచనలు కూడా వచ్చాయి’’ అని షాలినీ పాండే నవ్వేశారు.


Updated Date - 2020-06-28T06:54:29+05:30 IST