మహిళలను గౌరవించడమెలాగో వాళ్లకు తెలియదు

ABN , First Publish Date - 2020-05-26T04:24:02+05:30 IST

‘‘నవాజుద్దీన్‌, అతడి సోదరులకు మహిళలను గౌరవించడం ఎలాగో తెలియదు’’ అని నవాజుద్దీన్‌ సిద్దీఖి భార్య ఆలియా అలియాస్‌ అంజనా కిశోర్‌ పాండే ఆరోపించారు. ఆమె విడాకులు కోరుతూ,...

మహిళలను గౌరవించడమెలాగో వాళ్లకు తెలియదు

‘‘నవాజుద్దీన్‌, అతడి సోదరులకు మహిళలను గౌరవించడం ఎలాగో తెలియదు’’ అని నవాజుద్దీన్‌ సిద్దీఖి భార్య ఆలియా అలియాస్‌ అంజనా కిశోర్‌ పాండే ఆరోపించారు. ఆమె విడాకులు కోరుతూ, ఇటీవల భర్తకు ఈ-మెయిల్‌, వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపారు. నవాజుద్దీన్‌ సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తనను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆమె పేర్కొన్నారు. తాజాగా మరిన్ని విమర్శలు చేశారు. ‘‘పెళ్లైన తర్వాత నుంచి మామధ్య సమస్యలు మొదలయ్యాయి. మేం ఎప్పుడు మాట్లాడుకున్నా... నవాజుద్దీన్‌ నా తప్పుల్ని ఎత్తిచూపేవాడు. పలుమార్లు ఇతరుల ముందు నన్ను అవమానించాడు. వివాహ బంధంలో భార్యకు దక్కాల్సిన గౌరవాన్ని ఏనాడూ అతడు నాకు ఇవ్వలేదు. మా బంధంలో నేను నా ఆత్మ గౌరవాన్ని కోల్పోయా’’ అని ఆలియా సిద్దిఖీ అన్నారు. ఐదేళ్లుగా తామిద్దరం వేర్వేరుగా ఉంటున్నామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామానికి వెళ్లిన నవాజుద్దీన్‌, ఈ వివాదంపై ఇప్పటివరకూ స్పందించలేదు.

Updated Date - 2020-05-26T04:24:02+05:30 IST