ఆ ముగ్గురు ఇకపై అనాథలు కారు: సోనూసూద్

ABN , First Publish Date - 2020-07-31T23:26:47+05:30 IST

బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా కారణంగా నిజంగా జనాలకి రియల్ హీరోలెవరో తెలిసేలా చేస్తున్నాడు సోనూసూద్. ఇప్పటి వరకు

ఆ ముగ్గురు ఇకపై అనాథలు కారు: సోనూసూద్

బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా కారణంగా నిజంగా జనాలకి రియల్ హీరోలెవరో తెలిసేలా చేస్తున్నాడు సోనూసూద్. ఇప్పటి వరకు ఆయన చేసిన సహాయం ఏమిటీ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఆపద ఉంటే అక్కడ నేనుంటా.. అనేలా సోనూసూద్ నిజంగా అందరికీ దేవుడిలా మారిపోతున్నాడు. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు, విమానాలు సొంత ఖర్చులతో వేయించి వారిని సొంత ఇంటికి చేర్చారు. ఓ తండ్రి తన ఇద్దరి కూతుళ్లతో నాగలి లాగిస్తూ.. పొలం దున్నుతుంటే వెంటనే ఆ వ్యక్తికి ట్రాక్టర్ పంపారు. తన బర్త్‌డే సందర్భంగా ఎందరికో ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి కూరగాయలు అమ్ముకోవడం చూసి.. ఆమెకు జాబ్ తనే కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు. ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. తాజాగా ఆయన ముగ్గురు అనాథ పిల్లలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. 


తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిలో ముగ్గురు పిల్లలు ఎవ్వరూ లేక అనాథలుగా బ్రతుకుతున్నారు. ముగ్గురిలో పెద్దవాడే.. మిగతా ఇద్దరి ఆలనా పాలనా చూస్తున్నారు. వారు మీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారనే కథనం సోనూసూద్‌కు ట్యాగ్ అయింది. అంతే సోషల్ మీడియాలో వచ్చిన ఆ కథనం చూసి స్పందించిన సోనూసూద్.. ‘ఇకపై వారు ఎట్టిపరిస్థితుల్లోనూ అనాథలు కారు. వారి బాధ్యతను నేను తీసుకుంటున్నాను..’ అని ట్వీట్ చేశారు. ఇక అంతే.. నెటిజన్లు మరోసారి ఆయనని దేవుడ్ని చేసేస్తున్నారు.Updated Date - 2020-07-31T23:26:47+05:30 IST