అటు ‘వేదాళం’... ఇటు ‘లూసిఫర్’
ABN , First Publish Date - 2020-10-12T07:28:04+05:30 IST
వచ్చే ఏడాది ఏకకాలంలో రెండు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు చిరంజీవి...

వచ్చే ఏడాది ఏకకాలంలో రెండు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆయన ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్, మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ చేయనున్నారు. ఈ రెండు చిత్రాలనూ సమాంతరంగా షూటింగ్ చేయాలని చిరంజీవి అనుకుంటున్నారనీ, జనవరిలో ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయని తెలిసింది. చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టు దర్శకులు ఇద్దరూ కథల్లో మార్పులు చేశారు. కలకత్తా నేపథ్యంలో ‘వేదాళం’ రీమేక్ తెరకెక్కనుంది. దీని కోసమే చిరంజీవి అర్బన్ మాంక్ లుక్ ట్రై చేస్తున్నారు. ఇందులో చిరు చెల్లెలు పాత్రలో సాయి పల్లవి నటించనున్నారని సమాచారం. ‘లూసిఫర్’లో ఆయన రాజకీయ నాయకుడిగా విలక్షణ పాత్రలో కనిపించనున్నారు.
Read more