త్రివిక్రమ్‌ ప్రభావం ఉంది

ABN , First Publish Date - 2020-02-21T07:00:14+05:30 IST

‘‘తెలుగు పరిశ్రమలో ఉన్న అత్యుత్తమ రచయితల్లో త్రివిక్రమ్‌ ముందుంటారు. నేను ఆయన దగ్గర పని చేయడం వల్ల ఆ ప్రభావం నాపై చాలా ఉంది. నేను రాసిన సంభాషణలు ఆయన రైటింగ్‌ను...

త్రివిక్రమ్‌ ప్రభావం ఉంది

‘‘తెలుగు పరిశ్రమలో ఉన్న అత్యుత్తమ రచయితల్లో  త్రివిక్రమ్‌ ముందుంటారు. నేను ఆయన దగ్గర పని చేయడం వల్ల ఆ ప్రభావం నాపై చాలా ఉంది. నేను రాసిన సంభాషణలు ఆయన రైటింగ్‌ను పోలినట్లు ఉంటాయి అనడానికి అదొక కారణం’’ అని వెంకీ కుడుముల అన్నారు. నితిన్‌, రష్మిక మందన్నా జంటగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం దర్శకుడు వెంకీ  విలేకర్లతో చెప్పుకొచ్చిన సంగతులివి...


  • ‘ఛలో’ విడుదలయ్యాక నితిన్‌కి ఈ కథ చెప్పా. ఆయన కోసమే రాసిన కథ ఇది. బౌండెడ్‌ స్ర్కిప్ట్‌ పూర్తయ్యే వరకూ అంటే ఏడాదికాలం నాకోసం ఆయన వెయిట్‌ చేశారు. స్ర్కిప్ట్‌ లాక్‌ అయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. మధ్యలో మార్పులు, చేర్పుల గొడవే లేదు. షూటింగ్‌ కూడా చాలా ఈజీగా అయిపోయింది. ప్రతి కథలోనూ ప్రేమ మిళితమై ఉంటుంది. ఇందులోనూ కామన్‌గా లవ్‌స్టోరీ ఉంది. కాకపోతే అది వినోదాత్మకంగా సాగుతుంది.
  •   
  • రష్మిక డెడికేషన్‌తో పని చేసే నటి. తన ఎక్స్‌ప్రెషన్స్‌ నాకు ఇష్టం. అందుకే మరోసారి ఆమెను కథానాయికగా ఎంపిక చేశా. అయితే రెండో సినిమాతోనే రష్మిక పెద్ద స్టార్‌ అయిపోయింది. అసలు నా సినిమా చేస్తుందో లేదో అనుకున్నా. అడగ్గానే అంగీకరించింది. సినిమాలో నితిన్‌తో ఆమె చేసే సందడి అలరిస్తుంది. హుందాగా ఉండే ఓ పాత్ర కోసం అనంతనాగ్‌ని సంప్రదించా. ఆయనకు, నితిన్‌ సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. 

Updated Date - 2020-02-21T07:00:14+05:30 IST