కొందరి లాబీయింగ్‌ వల్లే థియేటర్లు మూతపడ్డాయి!

ABN , First Publish Date - 2020-09-08T06:01:57+05:30 IST

‘‘చిత్ర పరిశ్రమలో కొందరి లాబీయింగ్‌ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. అందువల్ల, పిఠాపురం థియేటర్‌లో ఫర్నీచర్‌ దొంగల పాలైంది. మరికొన్ని చోట్ల ఎలుకలు వల్ల కుర్చీలు...

కొందరి లాబీయింగ్‌ వల్లే థియేటర్లు మూతపడ్డాయి!

‘‘చిత్ర పరిశ్రమలో కొందరి లాబీయింగ్‌ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. అందువల్ల, పిఠాపురం థియేటర్‌లో ఫర్నీచర్‌ దొంగల పాలైంది. మరికొన్ని చోట్ల ఎలుకలు వల్ల కుర్చీలు నాశనమయ్యాయి. దీనికి బాధ్యులు ఎవరు?’’ అని నిర్మాత, ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జాయింట్‌ సెక్రటరీ నట్టి కుమార్‌ ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘రైళ్లు, విమానాల్లో సీటింగ్‌ కెపాసిటీ మార్చకుండా ఉన్నవాటితోనే రన్‌ చేస్తున్నారు. థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి నిబంధనలు ఎందుకు మారాయి? కరోనా కారణం చూపి థియేటర్లు ఓపెన్‌ చేయకపోతే మున్ముందు అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం మొదలవుతుంది. థియేటర్లు మూసివేయడం వల్ల వేలాది కార్మికులు నష్టపోయారు. ఓటీటీల వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయి. థియేటర్ల మూసివేత సాకుతో ఓటీటీ ద్వారా పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? హీరోలందరికీ కోట్ల మార్కెట్టు కేవలం థియేటర్ల వల్లే వచ్చిందని గ్రహించాలి’’ అన్నారు.

Updated Date - 2020-09-08T06:01:57+05:30 IST