టైటిల్‌ ఖరారు చేశారు

ABN , First Publish Date - 2020-05-25T08:50:00+05:30 IST

ఆది సాయికుమార్‌ హీరోగా జీబీ కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘బ్లాక్‌’ టైటిల్‌ ఖరారు చేశారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది...

టైటిల్‌ ఖరారు చేశారు

ఆది సాయికుమార్‌ హీరోగా జీబీ కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘బ్లాక్‌’ టైటిల్‌ ఖరారు చేశారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత షూటింగులకు అనుమతులు లభిస్తే... వెంటనే మిగతా చిత్రీకరణ పూర్తి చేసి, విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘హీరో పాత్ర, అందులో ఆది నటన కొత్తగా, వైవిధ్యంగా ఉంటాయి. అతని కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది’’ అని మహంకాళి దివాకర్‌ అన్నారు. దర్శనా బానిక్‌ హీరోయిన్‌గా, ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ కౌశల్‌, ఆమని, ‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి సంగీత దర్శకుడు.


Updated Date - 2020-05-25T08:50:00+05:30 IST

Read more