‘ఒరేయ్‌ బుజ్జిగా’ టీమ్‌కు అదే సక్సెస్‌

ABN , First Publish Date - 2020-10-12T07:24:14+05:30 IST

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, నా స్నేహితులు ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చూసి ఫోనులు చేసి బావుందని చెప్పారు...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ టీమ్‌కు అదే సక్సెస్‌

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, నా స్నేహితులు ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చూసి ఫోనులు చేసి బావుందని చెప్పారు. హాయిగా నవ్వుకున్నా మన్నారు. థియేటర్‌లో ఈలలు, కేకలు వేసే పరిస్థితి. ఓటీటీ విడుదల కాబట్టి ఫోనులు, మెసేజ్‌లు, సోషల్‌ మీడియా పోస్టులు చేస్తున్నారు. మా టీమ్‌కు అదే సక్సెస్‌’’ అని నిర్మాత కె.కె. రాధామోహన్‌ అన్నారు. రాజ్‌ తరుణ్‌, మాళవికా నాయర్‌ జంటగా ఆయన నిర్మించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌కుమార్‌ కొండా దర్శకుడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం నాలుగు లక్షలకు పైగా వ్యూస్‌ సాధించింది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులందరూ హాయిగా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. మా లక్ష్యం నెరవేరింది’’ అని అన్నారు. ‘‘రెండున్నర గంటలు పక్కా వినోదం అందించే చిత్రమిది’’ అని మాళవికా నాయర్‌ తెలిపారు. ‘‘సినిమా విజయం సాధిస్తుందని ముందే ఊహించాం. విడుదలైన 24 గంటల తర్వాత హిట్‌ టాక్‌ వచ్చింది’’ అని విజయ్‌కుమార్‌ కొండా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు ఐ. ఆండ్రూ, రచయిత నంధ్యాల రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-12T07:24:14+05:30 IST

Read more