అదే ముఖ్యం!

ABN , First Publish Date - 2020-12-01T06:43:33+05:30 IST

బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్యమున్న పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన కథానాయికల్లో తాప్సీ ఒకరు. ఇటీవల ఆమె నటించిన ‘తప్పాడ్‌’ చిత్రం చక్కని ప్రశంసలు...

అదే ముఖ్యం!

బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్యమున్న పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన కథానాయికల్లో తాప్సీ ఒకరు. ఇటీవల ఆమె నటించిన ‘తప్పాడ్‌’ చిత్రం చక్కని ప్రశంసలు అందుకుంది. ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలోనూ ఆమె బ్యాలెన్స్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్‌తో కొన్ని నెలలు ఇంటికే పరిమితమైన ఆమె ఇటీవల మాల్దీవులు విహారానికి వెళ్లారు. అంతకుముందు ఓ తమిళ సినిమా షూటింగ్‌ చేశారు. ట్రిప్‌ నుంచి రాగానే బాలీవుడ్‌లో ఓ కొత్త సినిమాతో బిజీ అయ్యారు. ‘బాలీవుడ్‌ సినిమా... మీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపింది?’ అన్న ప్రశ్నకు ‘‘సూర్మ’, ‘మిషన్‌ మంగళ్‌’ లాంటి సినిమాల్లో నిడివి తక్కువున్న పాత్రలు చేశా. అయినా ఆ రెండు సినిమాల్లో నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. హిందీలో నేను మంచి పాత్రలు చేస్తున్నాననీ దక్షిణాది గుర్తించింది. ఏ భాషా చిత్రమైనా ప్రేక్షకుల్ని ప్రభావితం చేసిందా? లేదా? అన్నదే ముఖ్యం. సౌత్‌లో నేను నటించిన కొన్ని సినిమాలు ఉత్తరాదిలో ఎంతో ప్రభావం చూపాయి. అలాగే దక్షిణాదిలో కూడా! దాంతోనే రెండు ప్రాంతాల్లోనూ నాకు మంచి అవకాశాలొస్తున్నాయి’’ అని తాప్సీ తెలిపారు.

Updated Date - 2020-12-01T06:43:33+05:30 IST

Read more