మా సినిమాలో విమాన ప్రమాదం ఒరిజినల్: ‘టెనెంట్’ నటుడు

ABN , First Publish Date - 2020-05-27T02:04:26+05:30 IST

ఇటీవల ఓ హాలీవుడ్ సినిమా టీజర్ విడుదలైంది. అందులో ఓ విమాన ప్రమాద సన్నివేశం ఉంది. అయితే ఏంటి ఇలాంటివి...

మా సినిమాలో విమాన ప్రమాదం ఒరిజినల్: ‘టెనెంట్’ నటుడు

న్యూయార్క్: ఇటీవల ఓ హాలీవుడ్ సినిమా టీజర్ విడుదలైంది. అందులో ఓ విమాన ప్రమాద సన్నివేశం ఉంది. ‘అయితే ఏంటి ఇలాంటివి చాలా చూశాం. సినిమాల్లో కార్లు పేలిపోవడం, విమానాలు కూలిపోవడం ఇలాంటి సన్నివేశాలను చూస్తూనే ఉంటాం. అవన్నీ టెక్నీలజీ సాయంతో సృష్టించిన కల్పితాలనీ మాకు తెలుసు అంటారా..’ అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఆ సినిమాలోని విమాన ప్రమాదం నిజంగా జరిగింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన టెనంట్ అనే చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. అందులో ఓ విమాన ప్రమాద సన్నివేశం ఉంది. దానికోసం పెద్ద భవనంపై నిజమైన విమానాన్ని కూల్చి సన్నివేశాన్ని తెరకెక్కించారు.


ఈ విషయాన్ని ఆ సినిమాలో నటించిన జాన్ డేవిడ్ వాషింగ్టన్ అనే నటుడు తెలిపారు. ‘అది నిజమైన భవనం. విమానం కూడా ఒరిజినల్. ఆ సన్నివేశం కోసం అంత పెద్ద విమానాన్ని భవనంపై కూల్చేశారు. దానికి నేను, తోటి నటులే సాక్ష్యం. అదో చారిత్రాత్మక సన్నివేశం’ అని డేవిడ్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-05-27T02:04:26+05:30 IST