మళ్ళా వెలుగు వస్తుందనీ...

ABN , First Publish Date - 2020-04-20T09:20:38+05:30 IST

‘‘ఈ చీకటి ఇలాగే ఉండిపోదనీ, మళ్ళా వెలుగు వస్తుందనీ... గొప్ప ఆత్మస్థైర్యం ఇచ్చే గీతమిది. హీరో మంచు మనోజ్‌ పాడిన ఈ పాట మన హృదయాలను ఆశ, పాజిటివిటీతో నింపుతుంది...

మళ్ళా వెలుగు వస్తుందనీ...

‘‘ఈ చీకటి ఇలాగే ఉండిపోదనీ, మళ్ళా వెలుగు వస్తుందనీ... గొప్ప ఆత్మస్థైర్యం ఇచ్చే గీతమిది. హీరో మంచు మనోజ్‌ పాడిన ఈ పాట మన హృదయాలను ఆశ, పాజిటివిటీతో నింపుతుంది’’ అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కోట్లాదిమందిని కరోనా క్షోభకు గురిచేస్తున్న ఈ తరుణంలో ఆ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కీర్తిస్తూ, ప్రజల సంరక్షణకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందిని ప్రశంసిస్తూ అచ్చు రాజామణి సంగీతంలో కాసర్ల శ్యామ్‌ రాసిన గీతం ‘అంతా బాగుంటాంరా’ని మంచు మనోజ్‌ ఆలపించారు. ఆయనతో లక్ష్మీ మంచు కుమార్తె విద్యా నిర్వాణ గళం కలిపారు. ఈ పాటను కేటీఆర్‌ ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఆయనకు మనోజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.


సర్జికల్‌ మాస్క్‌లు వాళ్ల కోసం సేవ్‌ చేయండి : మంచు విష్ణు

‘‘సర్జికల్‌ మాస్క్‌లను కరోనాపై యుద్ధంలో ముందుండి మనల్ని కాపాడుతున్న (వైద్య, పోలీస్‌, పారిశుద్ధ్య) సిబ్బంది కోసం సేవ్‌ చేయండి. టీషర్టు ఉంటే మీరూ ఇంట్లో మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. నేను పాత టీషర్టుతో చేసిన మాస్క్‌ వేసుకుంటున్నా’’ అని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-04-20T09:20:38+05:30 IST