తమన్నా రాకతో గ్రాఫ్‌ మారిపోయింది సత్యదేవ్‌

ABN , First Publish Date - 2020-12-08T07:07:09+05:30 IST

‘‘లాక్‌డౌన్‌లో చాలా సినిమాలు చూశా. ఎన్నో కథలు విన్నా. ‘లవ్‌ మాక్‌టైల్‌’ కథ వినగానే తప్పకుండా చేయాల్సిన సినిమా అనిపించింది...

తమన్నా రాకతో గ్రాఫ్‌ మారిపోయింది సత్యదేవ్‌

‘‘లాక్‌డౌన్‌లో చాలా సినిమాలు చూశా. ఎన్నో కథలు విన్నా. ‘లవ్‌ మాక్‌టైల్‌’ కథ వినగానే తప్పకుండా చేయాల్సిన సినిమా అనిపించింది. రొమాంటిక్‌ డ్రామాల్లో నేను నటించి చాలా రోజులు అయింది. ‘గుర్తుందా శీతాకాలం’ మంచి ఫీల్‌గుడ్‌ సినిమా అవుతుంది’’ అని తమన్నా అన్నారు. ఆమె హీరోయిన్‌గా, సత్యదేవ్‌ హీరోగా నాగశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. మేఘా ఆకాష్‌, కావ్యశెట్టి ఇతర పాత్రధారులు. నాగశేఖర్‌ - భావన రవి నిర్మాతలు. కన్నడ హిట్‌ సినిమా ‘లవ్‌ మాక్‌టైల్‌’కు రీమేక్‌ ఇది. ఇటీవల ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని తాజా షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు నేను హీరో అయినప్పటికీ తమన్నా రియల్‌ హీరో. ఆమె ఇందులో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాక ఈ సినిమా గ్రాఫ్‌ మారిపోయింది’’ అని అన్నారు. తనకు తెలుగులో తొలి చిత్రమిదని, ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించేలా సినిమా ఉంటుందని దర్శకుడు నాగశేఖర్‌ చెప్పారు. ‘‘నేను మాటలు అందించిన ‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబి’ సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా హిట్‌ అవుతుందని ఆశిస్తున్నా’’ అని మాటల రచయిత లక్ష్మీ భూపాల అన్నారు. 

Updated Date - 2020-12-08T07:07:09+05:30 IST