చిత్ర పరిశ్రమ నాకు అమ్మ లాంటిది
ABN , First Publish Date - 2020-07-27T12:15:07+05:30 IST
‘‘సినిమా మీదున్న ప్రేమే నన్ను పరిశ్రమలోని వివిధ విభాగాల్లో అడుగుపెట్టేలా చేసింది. నేను అమ్మలా భావించే సినీ పరిశ్రమ నాపై కొన్ని బాధ్యతలు పెట్టంది. వాటిని సక్రమంగా నెరవేర్చే...

‘‘సినిమా మీదున్న ప్రేమే నన్ను పరిశ్రమలోని వివిధ విభాగాల్లో అడుగుపెట్టేలా చేసింది. నేను అమ్మలా భావించే సినీ పరిశ్రమ నాపై కొన్ని బాధ్యతలు పెట్టంది. వాటిని సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తాను’’ అని ఏషియన్ సినిమాస్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ అన్నారు. ప్రస్తుతం ఆయన నాగచైతన్య, సాయి పల్లవి నటీనటులుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే! సోమవారం నారాయణదాస్ నారంగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘30 సంవత్సరాలుగా పరిశ్రమతో అనుబంధం ఉంది. ఏషియన్ సినిమాస్ సంస్థను ప్రారంభించి దాదాపు 650 చిత్రాలను పంపిణీ చేశాం. అందులో పరిశ్రమ గర్వించే ‘బాహుబలి’ లాంటి చిత్రాలు ఉండటం విశేషం. మహేశ్‌బాబుతో కలిసి ఏఎంబీ సినిమాస్ మల్టీఫ్లెక్స్ నిర్మించి ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమాటిక్ ఎక్స్‌పిరియన్స్ కలిగించాం. ఇటీవల సినిమా నిర్మాణంలోనూ అడుగుపెట్టాం. ఎమిగోస్ క్రియేషన్స్, పి.రామ్మోహన్‌రావుతో కలిసి ‘లవ్ స్టోరీ’ సినిమా నిర్మిస్తున్నా. 15 రోజులు షూటింగ్ చేయాల్సి ఉండగా లాక్‌డౌన్ మొదలైంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మిగతా షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదల చేస్తాం. శేఖర్ కమ్ముల పనితనం బాగా నచ్చింది. అందుకే ఆయన దర్శకత్వంలో ఓ స్టార్ హీరోతో మరో సినిమా చేయబోతున్నాం. ఆ విషయాలు త్వరలో తెలియజేస్తాం’’ అని తెలిపారు.
Read more