అలా కలిసింది అంతే!

ABN , First Publish Date - 2020-12-15T10:26:47+05:30 IST

నిత్యామీనన్‌ చక్కని అభినయం గల కథానాయికే కాదు. మధురంగా పాడగలిగే గాయని కూడా. తాజాగా ఆమె తనకెంతో ఇష్టమైన ప్రముఖ గాయని...

అలా కలిసింది అంతే!

నిత్యామీనన్‌ చక్కని అభినయం గల కథానాయికే కాదు. మధురంగా పాడగలిగే గాయని కూడా. తాజాగా ఆమె తనకెంతో ఇష్టమైన ప్రముఖ గాయని పి.సుశీలను కలిశారు. ఓ యాడ్‌ షూట్‌ కోసం సుశీలమ్మను కలిశానని నిత్యామీనన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫొటో షేర్‌ చేసి ‘అలా కలిసింది అంతే’ అని తెలిపారు. పాట పాడడం మీద నిత్యాకు ఎంతో అవగాహన ఉన్నప్పటికీ సమయం దొరికింది కదా అని సుశీలమ్మ దగ్గర పాడడంలో మెళకువలు, సంగీతం గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నారట. అయితే దీని వెనక కారణం లేకపోలేదు. ప్రస్తుతం నిత్యామీనన్‌ ‘గమనం’ సినిమాలో గాయని శైలపుత్రి దేవిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర పర్ఫెక్షన్‌ కోసమే నిత్యా సంగీతంలోని మెళకువలు నేర్చుకున్నారని నిత్యా పోస్ట్‌ చేసిన ఫొటోకు కామెంట్లు చేశారు నెటిజన్లు. ప్రస్తుతం నిత్యామీనన్‌ తెలుగు, మలయాళ భాషల్లో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Updated Date - 2020-12-15T10:26:47+05:30 IST

Read more