ఆ కథ ఫోనులో విన్నారు!

ABN , First Publish Date - 2020-09-07T05:16:08+05:30 IST

‘ఆదిపురుష్‌’ కథ ప్రభాస్‌ ఎక్కడ విన్నారో తెలుసా? ఫోనులో! అవును... మీరు చదివింది నిజమే! ఆయన ఆ కథ ఫోనులోనే విన్నారు. అదీ ఎప్పుడో తెలుసా?...

ఆ కథ ఫోనులో విన్నారు!

‘ఆదిపురుష్‌’ కథ ప్రభాస్‌ ఎక్కడ విన్నారో తెలుసా? ఫోనులో! అవును... మీరు చదివింది నిజమే! ఆయన ఆ కథ ఫోనులోనే విన్నారు. అదీ ఎప్పుడో తెలుసా? లాక్‌డౌన్‌ సమయంలో! దర్శకుడు ఓం రౌత్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘లాక్‌డౌన్‌ మీద నాకు కంప్లయింట్స్‌ ఏమీ లేవు. నేను కాలేజీ ఉన్నప్పట్నుంచీ ‘ఆదిపురుష్‌’ చిత్రకథ గురించి నాకో ఆలోచన ఉంది. ఇటువంటి కథను ఇంతకు ముందు రాశాను. లాక్‌డౌన్‌లో నా ఆలోచనలను మరోసారి బయటకు తీశా. పాత స్ర్కిప్ట్స్‌ బయటకు తీసి మళ్లీ రీ-వర్క్‌ చేశా. ప్రభాస్‌కి ఫోనులో కథ వివరించగా, అందులో మంచిని ఆయన చూశారు. అన్‌లాక్‌ దశ రాగానే హైదరాబాద్‌ వెళ్లి పూర్తిగా చెప్పాను’’ అని ఓం రౌత్‌ అన్నారు. వచ్చే జనవరిలో ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణ ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో లంకేశ్‌ పాత్రలో హిందీ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటించనున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-09-07T05:16:08+05:30 IST