అదో లాభం

ABN , First Publish Date - 2020-08-27T05:33:47+05:30 IST

శ్రుతీ హాసన్‌ కథానాయిక మాత్రమే కాదు! నటనకే ఆమె పరిమితం కాలేదు!! తండ్రి కమల్‌ హాసన్‌లా శ్రుతి సైతం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమెలో ఓ సంగీత దర్శకురాలు, గాయని ఉన్నారు...

అదో లాభం

శ్రుతీ హాసన్‌ కథానాయిక మాత్రమే కాదు! నటనకే ఆమె పరిమితం కాలేదు!! తండ్రి కమల్‌ హాసన్‌లా శ్రుతి సైతం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమెలో ఓ సంగీత దర్శకురాలు, గాయని ఉన్నారు. అలాగే  మంచి స్టేజి ఆర్టిస్ట్‌ కూడా. ఇటీవల ‘ఎడ్జ్‌’ అని ఓ పాట విడుదల చేశారు. యాదృచ్ఛికమో... మరొకటో... తమిళ చిత్రం ‘లాభం’లో ఆమె మ్యూజిషియన్‌గా నటించారు. ఓ విధంగా నిజ జీవిత పాత్రను తెరపై పోషిస్తున్నారన్నమాట. తెరపై విజయ్‌ సేతుపతికి జంటగా క్లారా పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో ఒక పాటను స్టేజి మీద ఆమె పెర్‌ఫార్మ్‌ చేస్తున్నట్టు ప్లాన్‌ చేశారు. వ్యవసాయదారులను కార్పొరేట్‌ కంపెనీలు ఏ విధంగా దోచుకుంటున్నాయనే కథాంశంతో రైతుల కష్టాలను ప్రస్తావిస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రైతుల పక్షాన పోరాటం చేసే కథానాయకుడితో సంగీత కళాకారిణి ఎలా ప్రేమలో పడింది? అతడికి ఎటువంటి సహాయం చేసింది? అనేది ఆసక్తికరమట. తెలుగులో రవితేజ సరసన ‘క్రాక్‌’లో ఆమె నటిస్తున్నారు.

Updated Date - 2020-08-27T05:33:47+05:30 IST