సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
ABN , First Publish Date - 2020-06-10T04:57:47+05:30 IST
తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతినిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలిపింది. ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తూ, అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు...

తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతినిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలిపింది. ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తూ, అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. కేసీఆర్ సమర్థ నాయకత్వంలో తెలంగాణలో చిత్ర పరిశ్రమ మరింత ఎత్తుకు చేరుకుంటుందని కచ్చితంగా నమ్ముతున్నాం. సినిమా థియేటర్లు కూడా తెరిచే విధంగా అనుమతులు ఇస్తారని ఆశిస్తున్నాం’’ అని నిర్మాత మండలి కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల తెలిపారు.