ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ.. షారుఖ్ ట్వీట్

ABN , First Publish Date - 2020-06-28T23:12:41+05:30 IST

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడు, అద్భుత నటుడు షారుఖ్.. తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించి నేటితో 28 ఏళ్లు పూర్తయింది.

ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ.. షారుఖ్ ట్వీట్

ముంబై: బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడు, అద్భుత నటుడు షారుఖ్.. తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించి నేటితో 28 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కింగ్‌ఖాన్ తన అభిమానులను ఉద్దేశించి ట్వీట్  చేశాడు. తన ప్యాషన్ ఎప్పుడు జీవిత లక్ష్యంగా మారిందో, అక్కడి నుంచి వృత్తిగా ఎప్పుడు మారిందో కూడా తనకు తెలియలేదని షారుఖ్ చెప్పాడు. ‘నా ప్రొఫెషనలిజానికన్నా కూడా నా ప్యాషన్‌తో మరింతకాలం మీకు సేవలందించగలనని నమ్ముతున్నా. ఇంతకాలం మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-06-28T23:12:41+05:30 IST