క‌ల‌లో కూడా అనుకోలేదంటున్న త‌మ‌న్నా!

ABN , First Publish Date - 2020-04-25T16:39:52+05:30 IST

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తోన్న లేటెస్ట్ టాలీవుడ్ మూవీ ‘సీటీమార్‌’. ఈ చిత్రంలో గోపీచంద్ హీరో. ఇందులో జ్వాలా అనే క‌బ‌డ్డీ కోచ్‌గా త‌మ‌న్నా క‌నిపించ‌నున్నారు.

క‌ల‌లో కూడా అనుకోలేదంటున్న త‌మ‌న్నా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తోన్న లేటెస్ట్ టాలీవుడ్ మూవీ ‘సీటీమార్‌’. ఈ చిత్రంలో గోపీచంద్ హీరో. ఇందులో జ్వాలా అనే క‌బ‌డ్డీ కోచ్‌గా త‌మ‌న్నా క‌నిపించ‌నున్నారు. అస‌లు ఈ పాత్ర కోసం త‌మ‌న్నా ఎలా క‌ష్ట‌ప‌డ్డారు? అనే విష‌యాన్ని చూస్తే.. ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో జ్వాలా పాత్ర గురించి మాట్లాడుతూ ‘‘అస‌లు నేను క‌బ‌డ్డీ ఆడ‌తాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. డైరెక్ట‌ర్ సంప‌త్ నందిగారు ఈ పాత్ర గురించి చెప్ప‌గానే నాకు బాగా న‌చ్చింది. ఛాలెంజింగ్‌గా అనిపించింది. దీంతో పాత్ర చేయ‌డానికి రెడీ అయ్యాను. రెగ్యుల‌ర్ పాత్ర‌ల‌కు భిన్న‌మైన చిత్ర‌మిది. కాబ‌ట్టి శారీర‌కంగా, మాన‌సికంగా ధృడంగా, ఫిట్‌గా ఉండాల‌ని రెండు నెల‌ల పాటు శిక్ష‌ణ తీసుకున్నాను’’ అన్నారు. 

Updated Date - 2020-04-25T16:39:52+05:30 IST