మిస్ యూ నాన్న: తమన్

ABN , First Publish Date - 2020-10-09T20:46:32+05:30 IST

చిన్న వయసులోనే సంగీత రంగంలోకి ప్రవేశించి బోలెడంత అనుభవం సంపాదించుకున్నాడు తమన్.

మిస్ యూ నాన్న: తమన్

చిన్న వయసులోనే సంగీత రంగంలోకి ప్రవేశించి బోలెడంత అనుభవం సంపాదించుకున్నాడు తమన్. ఎంతో మంది సంగీత దర్శకుల వద్ద పనిచేసిన తమన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు. ఈ ఏడాది `అల వైకుంఠపురములో..` చిత్రం రూపంలో మరపురాని విజయాన్ని అందుకున్నాడు. 


తాజాగా తమన్ తన తండ్రి ఘంటసాల శివ కుమార్‌ని గుర్తు చేసుకున్నాడు. చిన్న వయసులోనే తనకు దూరమైన తండ్రి గురించి ట్వీట్ చేశాడు. `మిస్ యూ నాన్నా.. పాతికేళ్ల క్రితం 1995లో తీసిన ఫొటో ఇది. నాకు ఎంతో ఇష్టమైన నాన్నతో ఇది నా చివరి ఫొటో. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావని నాకు తెలుసు` అంటూ ట్వీట్ చేశాడు. తండ్రితో కలిసి తీయించుకున్న తన చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేశాడు.   
Updated Date - 2020-10-09T20:46:32+05:30 IST