తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్..!

ABN , First Publish Date - 2020-11-06T01:02:29+05:30 IST

తమిళనాడు రాజకీయాల్లో మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్త తమిళ మీడియాలో గురువారం ఉదయం నుంచి...

తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్..!

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్త తమిళ మీడియాలో గురువారం ఉదయం నుంచి హల్‌చల్ చేసింది. విజయ్ తన పార్టీ పేరును కూడా ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించాడని, పార్టీ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నాడన్న వార్తలు ఛానళ్లలో చక్కర్లు కొట్టాయి. విజయ్ కూడా రాజకీయాల్లోకి రానుండటంతో తమిళనాడులో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని తమిళ మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. అయితే.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ పీఆర్‌ఓ, ఈవెంట్ మేనేజర్ రియాజ్ కె అహ్మద్ ప్రకటించారు. విజయ్ పొలిటికల్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ట్వీట్ చేశారు. అయితే.. ఈ గందరగోళంపై స్పష్టతనిస్తూ విజయ్ తరపు నుంచి ఓ ప్రెస్‌ నోట్ విడుదలయినట్లు.. ఆ కాపీని రియాజ్ కె అహ్మద్ ట్వీట్ చేశారు.



తన తండ్రి రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని విజయ్ చెప్పినట్లుగా ఆ ప్రెస్ రిలీజ్ కాపీలో ఉంది. తనకు ఆ రాజకీయ పార్టీతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని విజయ్ స్పష్టం చేసినట్లుగా ఆ ప్రెస్‌నోట్‌లో ఉండటం గమనార్హం. తన తండ్రి స్థాపించబోతున్న పార్టీ అన్న ఉద్దేశంతో తన అభిమానులు ఎవరూ ఆ పార్టీలో చేరవద్దని విజయ్ చెప్పినట్టుగా ఆ ప్రెస్ రిలీజ్ కాపీలో ఉండటం కొసమెరుపు. తన పేరుతో గానీ, ఫొటోతో గానీ.. ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’ పేరుతో గానీ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని విజయ్ స్వయంగా చెప్పుకొచ్చినట్టుగా ఉన్న ఆ ప్రెస్ నోట్‌లో ఉంది.





Updated Date - 2020-11-06T01:02:29+05:30 IST