వద్దంటున్న సోనూసూద్‌.. కానీ వాళ్లు వినడం లేదు

ABN , First Publish Date - 2020-12-01T14:16:45+05:30 IST

రియల్‌ హీరో సోనూసూద్ కు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో అభిమానులు ఏకంగా గుడులు కట్టేస్తున్నారు.

వద్దంటున్న సోనూసూద్‌.. కానీ వాళ్లు వినడం లేదు

లాక్‌డౌన్‌ సమయంలో కొన్ని వందల మందికి సహాయ సహకారాలు అందించి తోడుగా నిలిచి రియల్‌ హీరోగా మారారు సోనూసూద్‌. ఇప్పటికీ చాలా మంది తమకు సాయం కావాలంటూ అడుగుతున్నారు.. సోనూసూద్‌ కూడా లేదనకుండా సాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడీ రియల్‌ హీరోకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో అభిమానులు ఏకంగా గుడులు కట్టేస్తున్నారు. అలాంటి పనులు చేయకండి..నేను వాటికి అర్హుడిని కాను బాబోయ్‌! అని సోనూ చెబుతున్నా అభిమానులు వినడం లేదు. సాధారణంగా గుండెల్లో గుడులు కడుతుంటారు. సోనూసూద్‌ ఆ స్థాయిని దాటేశాడు.. ఇప్పుడు గుండెల్లోని గుడులు కాస్త బయటే కట్టేస్తున్నారు.  అభిమానులంటే అంతే మరి.  
Updated Date - 2020-12-01T14:16:45+05:30 IST

Read more