తెలుగమ్మాయిని కావడమే నాకు అడ్వాంటేజ్: కావ్య
ABN , First Publish Date - 2020-07-19T22:35:36+05:30 IST
కావ్య అంటే ప్రస్తుతం ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ తొలిచిత్రం గంగోత్రిలోని ‘వల్లంకి పిట్ట..వల్లంకిపిట్ట’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి

కావ్య అంటే ప్రస్తుతం ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ తొలిచిత్రం గంగోత్రిలోని ‘వల్లంకి పిట్ట..వల్లంకిపిట్ట’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. అక్షరాలా తెలుగు అమ్మాయి. ఈనెల 20వ తేదీ సోమవారం రోజు కావ్య పుట్టినరోజు. ‘బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ’ మొదలైన సినిమాల్లో బాలనటిగా చేసింది కావ్య. శ్రీదేవి, మీనా, రోజారమణి, రాశి, హన్సిక, లయ ఇలా ఎందరో బాలతారలుగా వచ్చి సూపర్ హీరోయిన్స్ అయ్యారు. స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. అలా కావ్య కూడా తన కలలు..ఆశయాలు నెరవేర్చుకునేలా సినిమా రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు హీరోయిన్ కాబోతుంది. అంతకన్నా ముందు దాదాపు పదిహేనేళ్ళ నుంచి కూచిపూడి డాన్సర్. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు కావ్య. అలాగని చదువు నిర్లక్ష్యం చేయలేదు. పూణేలోని ఓ కాలేజీలో ‘లా’ పూర్తి చేశారు. చదువు పూర్తి చేసి సినిమా వైపు దృష్టి సారించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలకు కూడా ఆడిషన్స్ చేస్తున్నారు కావ్య. ఆడిషన్స్‌తో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటుంది కావ్య.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్‌కి ముందుగానే ట్రయిల్స్ స్టార్ట్ చేశాను. కరోనా రాకుండా ఉంటే ప్రాజెక్ట్ ఈ పాటికి ఖచ్చితంగా అనౌన్స్ అయి ఉండేది. గంగోత్రి అప్పుడు నాకు మూడు.. నాలుగేళ్ళ వయసు ఉంటుంది. సినిమా గురించి అంత ఊహ తెలియదు. అలా 12 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఎదిగే కొద్దీ హీరోయిన్ కావాలనుకున్నాను. ఎకడమిక్ ఇంట్రెస్ట్.. చదివితే ఇప్పుడే చదివెయ్యాలి. పూర్తి చేయాలి.. యాక్టింగ్ లోకి వచ్చి చదవలేక పోయానే అని బాధపడకూడదు. ప్రపంచాన్ని బాగా తెలుసుకుని.. అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది..అందుకే ‘లా’ కంప్లీట్ చేశాకే సినిమా కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నాను. చదువుతో పాటు రెగ్యులర్ డ్యాన్స్ ప్రాక్టీస్, ఫిజిక్ మీద అవసరమైన శ్రద్ధ తీసుకున్నాను. పూణేలో ఉన్నా.. అందరికంటే ఎక్కువ సినిమాలు చూశాను. సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ప్రతి సినిమా ఫాలో అవుతాను. తెలుగు చదువుతాను, మాట్లాడతాను. తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్‌గా ఫీలవుతున్నాను. ఎందుకంటే మన తెలుగు కల్చర్, నేటివిటీ ఖచ్చితంగా హిందీ హీరోయిన్ల కన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. స్క్రిప్ట్‌ని సులభంగా అర్థం చేసుకోగలం. ఆ పాత్రల బిహేవియర్స్ ఈజీగా పట్టుకోగలం. ఏ పాత్ర చేసినా ఆ ప్రాజెక్ట్ నాకు ఆర్టిస్ట్‌గా ఉపయోగపడాలి. అలాగే నేనూ ప్రాజెక్ట్‌కి ఉపయోగపడాలి. నాకు రియాలిటీకి దగ్గరగా ఉండేవి, ఇంట్రెస్టింగ్, ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీ పాజ్‌లో ఉంది. కాని ఇందాక చెప్పినట్లు లాక్‌డౌన్ ముందు నుంచే ట్రై చేస్తున్నాను. ఇళ్ళల్లో కూర్చున్నవాళ్ళంతా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో, ఆన్‌లైన్‌లో, టీవీ ఛానెల్స్‌లో విపరీతంగా సినిమాలు, సిరీస్‌లు చూస్తున్నారు. కంటెంట్ అయిపో వస్తోంది. ఎంతో ఎంటర్‌టైనింగ్ కంటెంట్ జనానికి అవసరం. అందువల్ల అవకాశాలకి ఇబ్బంది ఉండదని భావిస్తున్నాను. ఆలస్యం కావచ్చు కానీ ఓటీటీకి సంబంధించి కంటెంట్ పరంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. అలాంటి అవకాశం వచ్చి నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా ఓటీటీ కోసం వర్క్ చేస్తాను..’’ అని తెలిపింది.