గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తల్లి గీతా భాస్కర్‌తో తరుణ్
ABN, First Publish Date - 2020-06-22T00:50:09+05:30
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తల్లి గీతా భాస్కర్‌తో కలిసి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఎందరో సెలెబ్రెటీస్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కరోనా వల్ల మనం చాలా నేర్చుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి ఛాలెంజ్‌లు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాను. నేను నటులు విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, అభయ్ బెతిగంటిలను నామినేట్ చేస్తున్నాను..’’ అని అన్నారు.
తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఛాలెంజ్‌లో నేను పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ సమయంలో కూడా దీన్ని ముందుకు తీసుకు వెళ్లడం చాలా గొప్ప విషయం. ఈ ఛాలెంజ్ మరింత ముందుకు వెళ్ళాలి. నా కోడలు (తరుణ్ భాస్కర్ భార్య) లతని ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.