టైగర్ సరసన తారా సుతారియా!

ABN , First Publish Date - 2020-10-30T20:20:28+05:30 IST

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ తారా సుతారియా జంట మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.

టైగర్ సరసన తారా సుతారియా!

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ తారా సుతారియా జంట మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2`లో అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన ఈ జంట త్వరలో `హీరోపంతీ-2`లో కలిసి నటించనుంది. ఈ విషయాన్ని తార సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.


తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొంది. సాజిద్ నడియాద్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అహ్మద్ ఖాన్ రూపొందించనున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. 

Updated Date - 2020-10-30T20:20:28+05:30 IST