నెపోటిజంకు పరిష్కారం లేదు: తాప్సీ

ABN , First Publish Date - 2020-09-20T18:57:55+05:30 IST

ఎలాంటి అండదండలు లేకుండా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న తాప్సీ రీసెంట్‌గా నెపోటిజంపై స్పందించారు.

నెపోటిజంకు పరిష్కారం లేదు:  తాప్సీ

వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అటు బాలీవుడ్‌, ఇటు దక్షిణాది సినీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు తాప్సీ. ఎలాంటి అండదండలు లేకుండా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న తాప్సీ రీసెంట్‌గా నెపోటిజంపై స్పందించారు. బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో బాలీవుడ్‌లోని నెపోటిజంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాప్సీ చేసిన వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాయి. "సినీ ఇండస్ట్రీలో అవుట్‌ సైడర్‌, ఇన్‌ సైడర్‌ అంటూ పలు డిబేట్స్ జరిగాయి. అయితే అందరూ మాట్లాడుతున్నారు కానీ.. ఎవరికీ పరిష్కారం తెలియదు. ఓ ఆర్టిస్ట్‌ సక్సెస్‌కు కారణం తను ఎలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకుంటున్నారనేదే. అంతే తప్ప స్టార్‌ కిడ్స్‌కు సరైన సినిమాలు వస్తాయని అనుకోవడం తప్పు. ఓపికగా ఎదురుచూడటం, కష్టపడటంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రతి చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఆ చిన్న అవకాశాన్ని మన జీవితాన్ని మార్చేస్తుంది" అన్నారు తాప్సీ. 


Updated Date - 2020-09-20T18:57:55+05:30 IST