బాలయ్య చాలా ఫన్నీ: తనుశ్రీ దత్తా
ABN , First Publish Date - 2020-12-30T17:49:13+05:30 IST
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్‌పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది నటి తనుశ్రీ దత్తా.

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్‌పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది నటి తనుశ్రీ దత్తా. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ అయిన ఈ భామ మళ్లీ వెండితెరపై మెరవాలనుకుంటోంది. హిందీతోపాటు ప్రాంతీయ భాషల సినిమాల్లోనూ నటించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా `ఏబీఎన్-ఆంధ్రజ్యోతి`కి ఇంటర్వ్యూ ఇచ్చిన తనుశ్రీ.. టాలీవుడ్ గురించి మాట్లాడింది.
`కంటెంట్ పరంగా టాలీవుడ్ చాలా ఎత్తులో ఉంది. మంచి అవకాశం వస్తే టాలీవుడ్‌లో నటిస్తా. పాత్ర నాకు నచ్చితే విలన్‌గా కనిపించేందుకు కూడా రెడీ. నేను గతంలో బాలకృష్ణతో కలిసి `వీరభధ్ర` సినిమాలో నటించా. ఆయన చాలా ఫన్నీ. చాలా విషయాలు చెప్పేవారు. తెలుగు సినీ పరిశ్రమ ఎలా ఉంటుందో వివరించారు. బాలయ్యతో పాటు యూనిట్ అంతా నన్ను బాగా చూసుకున్నారు. కొత్త కొత్త రుచులు ట్రై చేశా. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి నేను 5 కిలోల బరువు పెరిగాన`ని తనుశ్రీ చెప్పింది.