తనికెళ్ల భరణి నోట.. ‘ఆడపిల్ల’ పద్యం
ABN , First Publish Date - 2020-10-12T03:56:03+05:30 IST
ఆడపిల్లంటే కొందరికి అదృష్టం - మరికొందరి దృష్టిలో దురదృష్టం. ఈ బేధాలను చెరిపేసి ఆడపిల్లంటే ఒక వరం అని చాటడానికి వెలసిన రోజు ఇంటర్నేషనల్

ఆడపిల్లంటే కొందరికి అదృష్టం - మరికొందరి దృష్టిలో దురదృష్టం. ఈ బేధాలను చెరిపేసి ఆడపిల్లంటే ఒక వరం అని చాటడానికి వెలసిన రోజు ఇంటర్నేషనల్ డే ఫర్ గాళ్ చైల్డ్. ఆరోజునైనా అమ్మాయిలను ఆదరించి గౌరవించే బాటలో నడుద్దాం. అక్టోబర్ 11న ఇంటర్నేషనల్ డే ఫర్ గాళ్ చైల్డ్ సందర్భంగా గాళ్ చైల్డ్ గొప్పతనాన్ని తెలుపుతూ.. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. తాజాగా మల్టీ టాలెంటెడ్ నటుడు తనికెళ్ల భరణి సోషల్ మీడియా వేదికగా ‘ఆడపిల్ల’ అంటూ ఓ పద్యం ఆలపించారు. ఈ పాటను డాక్టర్ సూర్య గణపతిరావు రచించగా విను మరీ కోసం తాను పాడినట్లుగా చెబుతూ.. తనికెళ్ల భరణి ఈ పద్యాన్ని ఆలపించారు.
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా ‘ఆడపిల్ల’ పద్యం.. అంటూ విను మరీ కోసం తనికెళ్ళ భరణి పాడిన ఈ పద్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ పద్యం వినాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. క్రింది వీడియోను చూడండి.