తనికెళ్ల భరణి ఎవరిని నామినేట్ చేశారో తెలుసా?

ABN , First Publish Date - 2020-08-27T18:18:41+05:30 IST

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ను సినీ ప్రముఖులు ముందుకు తీసుకెళ్తున్నారు.

తనికెళ్ల భరణి ఎవరిని నామినేట్ చేశారో తెలుసా?

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ను సినీ ప్రముఖులు ముందుకు తీసుకెళ్తున్నారు. తమ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటుతూ ప్రకృతి ప్రేమికులుగా మారుతున్నారు. అనంతరం వేరొకరిని నామినేట్ చేస్తూ ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. టీఆర్ఎస్ నాయకుడు రాఘవ నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తాజాగా పూర్తి చేశారు. 


తన ఇంటి పరిసర ప్రాంతంలో మొక్కలు నాటారు. ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. `రాఘవ నుంచి `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటాను. ఈ ఛాలెంజ్‌కు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్, సుహాసిని, నటుడు నాజర్, ప్రకాష్ రాజ్‌ను నామినేట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారికి ప్రత్యేక ధన్యవాదాల`ని తనికెళ్ల భరణి పేర్కొన్నారు. 
Updated Date - 2020-08-27T18:18:41+05:30 IST