'నెపోటిజం' లిరికల్ వీడియో ఆవిష్కరించిన తమ్మారెడ్డి

ABN , First Publish Date - 2020-11-03T21:04:43+05:30 IST

పాపిన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కొర్రపాటి వెంకట రమణ సమకుడిగా విపుల్ దర్శకత్వంలో వై.అనిల్ కుమార్, కె.శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం 'నెపోటిజం'. వెంకీ, వాసిం, వెంకట్ పొడి శెట్టి, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించారు

'నెపోటిజం' లిరికల్ వీడియో ఆవిష్కరించిన తమ్మారెడ్డి

పాపిన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కొర్రపాటి వెంకట రమణ సమకుడిగా విపుల్ దర్శకత్వంలో వై.అనిల్ కుమార్, కె.శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం 'నెపోటిజం'. వెంకీ, వాసిం, వెంకట్ పొడి శెట్టి, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మంగళవారం ఈ చిత్రం లిరికల్ వీడియో సాంగ్‌ను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మా రెడ్డి భరద్వాజ మాట్లాడుతూ "నెపోటిజం ఉన్నమాట వాస్తవమే. చాలా మంది హీరోల కొడుకులు, డైరెక్టర్స్ కొడుకులు హీరోలుగా ట్రై చేసి ఫెయిల్ అయ్యి వెళ్లి పోయారు. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా వచ్చి వాళ్ళ టాలెంట్‌తో సూపర్ స్టార్ అయిన వాళ్ళు వున్నారు.  మన టాలెంట్‌ను మనం ప్రదర్శించాలి. దానికి పట్టుదల కావాలి. సిన్సియర్‌గా వుండాలి. అనే పాయింట్స్‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. ఎంత సేపు వాళ్ళను, వీళ్ళను తిట్ట కుండా తీశాడు దర్శకుడు ట్రైలర్ చూశాను. మంచి ప్రయత్నం చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా రాకపోయినా నిజంగా టాలెంట్ వుంటే మంచి పొజిషన్ కి వస్తారు. మనల్ని మనం నమ్ముకోవాలి" అన్నారు. 



దర్శకుడు విపుల్ మాట్లాడుతూ "నెపోటిజమ్ సాంగ్‌ను ఆవిష్కరించి మమ్మల్ని ఆశీర్వదించిన తమ్మారెడ్డిగారికి కృతజ్ఞతలు. పుట్టగానే ఎవ్వరూ స్టార్ కారు.. స్టార్ కావడానికి ఎవరైనా కఠోర శ్రమ చెయ్యాలనే పాయింట్‌నే ఈ సినిమాలో చూపిస్తున్నాం. దీపావళికి సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం" అన్నారు. 

Updated Date - 2020-11-03T21:04:43+05:30 IST