తీవ్ర అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో చేరిన రజినీ

ABN , First Publish Date - 2020-12-25T18:45:24+05:30 IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. రెండు రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది.

తీవ్ర అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో చేరిన రజినీ

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. రెండు రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య ఆస్పత్రిలోనే ఉన్నారు. కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్‌గా తేలింది. పూర్తి సమాచారం త్వరలో వెలువడనుంది. మరోవైపు ఆయన ఆరోగ్యంపై అభిమానలలో ఆందోళన నెలకొంది. 


ఇదిలా ఉంటే, రజినీ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ నగరంలోని రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు. షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రొడక్షన్ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకడంతో షూటింగ్ నిలిపేశారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. Updated Date - 2020-12-25T18:45:24+05:30 IST