పెద్దనోట్ల రద్దు నష్టాలపై సరికొత్త చిత్రం ‘రూ.2000’

ABN , First Publish Date - 2020-12-29T00:08:26+05:30 IST

కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం పెద్దనోట్ల రద్దు చేయడంతో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను కథాంశంగా ‘రూ.2000’ పేరుతో తమిళంలో ఓ చిత్రాన్ని ఫినిక్స్‌ తిరైపడైప్పగమ్‌ బ్యానర్‌పై పచ్చియప్పన్‌ అలియాస్‌ రాజా నిర్మిస్తున్నారు.

పెద్దనోట్ల రద్దు నష్టాలపై సరికొత్త చిత్రం ‘రూ.2000’

కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం పెద్దనోట్ల రద్దు చేయడంతో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను కథాంశంగా ‘రూ.2000’ పేరుతో తమిళంలో ఓ చిత్రాన్ని ఫినిక్స్‌ తిరైపడైప్పగమ్‌ బ్యానర్‌పై పచ్చియప్పన్‌ అలియాస్‌ రాజా నిర్మిస్తున్నారు.  రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల ఓ పేదరైతుకు కలిగిన నష్టాలు, దానికి వ్యతిరేకంగా జరిగిన న్యాయపోరాటం, పరువు హత్యలపై వ్యతిరేక అవగాహన తదితర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు రాజా తెలిపారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ప్రముఖ ప్రవచకుడు, దర్శకుడు భారతి కృష్ణకుమార్‌, రాజకీయ విమర్శకుడు అయ్యనాధన్‌, పెరియార్‌ సిద్ధాంతాల ప్రచారకర్త ఓవియా, తమిళ్‌ జాతీయ చింతనాపరుడు త్యాగు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితోపాటు రుద్రన్‌ పరాశు, షర్నికా, ‘పరియేరుమ్‌ పెరుమాళ్‌’ ఫేమ్‌ కరాటే వెంకటేష్‌, ‘పిచ్చైక్కారన్‌’ ఫేమ్‌ మూర్తి, బిర్లా బోస్‌, మీడియా ప్రతినిధులు జెన్‌రామ్‌, ఉమా, జీవశకాబ్దన్‌ తదితరులు నటించారు. ఇనియన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రుద్రన్‌ దర్శకత్వం వహించారు.

Updated Date - 2020-12-29T00:08:26+05:30 IST