‘మాస్టర్‌’... సంక్రాంతికి!

ABN , First Publish Date - 2020-12-27T11:02:04+05:30 IST

‘మాస్టర్‌’... సంక్రాంతికి!

‘మాస్టర్‌’... సంక్రాంతికి!

తమిళ కథానాయకుడు విజయ్‌, ‘ఖైదీ’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కలయికలో రూపొందిన సినిమా ‘మాస్టర్‌’. సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానున్న సినిమాల జాబితాలో ఇదీ ఉన్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. పెద్ద పండక్కి ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావడానికి జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో గ్జేవియర్‌ బ్రిట్టో నిర్మించిన ఈ సినిమా తెలుగు హక్కులను మహేశ్‌ ఎస్‌. కోనేరు దక్కించుకున్నారు. విజయ్‌ ‘విజిల్‌’ను సైతం తెలుగులో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై విడుదల చేసింది ఆయనే. ఇటీవల ‘మాస్టర్‌’ తెలుగు వెర్షన్‌ టీజర్‌, ‘చిట్టి స్టోరీ’ పాట విడుదల చేశారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్‌ కథానాయిక. హీరోకి దీటైన పాత్రలో విజయ్‌ సేతుపతి నటించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు.

Updated Date - 2020-12-27T11:02:04+05:30 IST