తమిళ సినీ దర్శకుడు బాలమిత్రన్‌ మృతి

ABN , First Publish Date - 2020-06-12T06:22:06+05:30 IST

తమిళ యువ దర్శకుడు బాలమిత్రన్‌ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. ఆయన వయస్సు 39 సంవత్సరాలు. తమిళ దర్శకుడు సుకి మూర్తివద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన బాలా అలియాస్‌ బాలమిత్రన్...

తమిళ సినీ దర్శకుడు బాలమిత్రన్‌ మృతి

తమిళ యువ దర్శకుడు బాలమిత్రన్‌ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. ఆయన వయస్సు 39 సంవత్సరాలు. తమిళ దర్శకుడు సుకి మూర్తివద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన బాలా అలియాస్‌ బాలమిత్రన్‌ ‘ఆయిలరం కుట్రవాలిగల్‌ తప్పిక్కలాం’, ‘కళ్వర్‌గళ్‌’, ‘ఉడుక్కై’ అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఉడుక్రై’ మినహా తక్కిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఉడుక్కై’ చిత్రం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో లాక్‌డౌన్‌ అమలుకు వచ్చింది. దీనితో షూటింగ్‌ అర్థాంతరంగా ఆగింది. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం బాలమిత్రన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి పక్షవాతం వచ్చింది. ఆసుపత్రిలో చేరి చికిత్సలు పొందటానికి కూడా చేతిలో డబ్బులు లేక ఇబ్బందులుపడ్డారు. సినీ దర్శకుల సంఘం సభ్యులు చేసిన ఆర్థిక సహాయంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున ఆయన మృతి చెందారు.

Updated Date - 2020-06-12T06:22:06+05:30 IST